Friday, April 3, 2009

సలాం మహంతి సాబ్

ఎలెక్షన్ కమిషనర్ అంటూ ఒకరు ఉంటారు అని సామాన్య ప్రజలకు తెలిసింది శేషన్ కమిషనర్ గా వచ్చినతరువాతే. ప్రస్తుతం డి అయ్ జి [D.I.G] గురుంచి తెలుస్తోంది. కొత్తగ పదవిలోకి వచ్చిన మహంతి గారు ప్రజల మెప్పు పొందుతున్నారు. ముఖ్యముగా ప్రస్తుత ఎన్నికల సమయములో తనికీలు ముమ్మరం చేసి రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇలాంటి అధికారి అద్వర్యంలో పనిచేస్తున్నందుకు డిపార్టుమెంటు పోలిసులు కూడా సంతోషంగా, నిబద్దతో పనిచేస్తున్నారని పత్రికల్లో వార్తలు చదివినప్పుడు నా లాంటి సామాన్యుడికి చాలా సంతోషం కలుగుతుంది. మహంతి గారి జోరు ఇలా సాగితే ఖచ్ఛితంగా నేరాలు తగ్గుతాయి అని నమ్మటం లో ఎలాంటి సందేహం లేదు.


0 comments:

Post a Comment