
మహిళా లోకానికి వందనాలు, శుభాకాంక్షలు. నైనలాల్ కిద్వాయ్, కిరణ్ మజుందార్, చందా కొచ్చార్, సులజ్జ మోత్వాని, శోభనా భర్థియ, సంగిత రెడ్డి, స్వాతి పిరమాల్, ఇంద్రానూయి, పద్మశ్రీ వారియార్ ... ఇలా ఎంతో మంది మహిళలు తమ తమ రంగాలలో విజయం సాదిస్తున్నారు. విజయాలు సాదిస్తూ పేరు ప్రఖ్యాతలు గుర్తింపు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జన్మనిచ్చే ఆడవారికి ఎంతో సహనం ఉంటుంది, ఎన్నో ప్రతికూల పరిస్తులలో కూడా ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తారు. మన జనాబా లో యాచన చేసే ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారికి సరియైన వసతులు లేక చదువుకునే పరిస్తులలో లేరు, దాని మూలంగా వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి వారి సంతానం కూడా అదే బాట పట్టే అవకాశాలు చాల ఉన్నాయ్. ఎంతోమంది మహిళలు విజయ శికరాలు పొందినవారు ఇలాంటి యాచకులకు, వీధి బాలలకు చదువుకోటానికి అవకాశాలు కల్పించి వారి జీవితాలు జీవితాలకు చక్కని బాట వేస్తే అప్పుడు జరుపుకునే మహిళా దినోత్సవం ఎంతో సంతోశానిస్తుంది.


0 comments:
Post a Comment