Monday, February 23, 2009

జై హొ - A.R. Rahaman


భారతీయులు అందరు గర్వపడే క్షణాలు A.R.రహమాన్ మనకు అందిచారు. ముబారక్ రహమాన్ భాయ్.
8 oscar అవార్డ్స్ దక్కించుకొని Slumdog Millionaire భారతీయులందరి ప్రశంశలు అందుకుంటుంది. A.R.రహమాన్ Slumdog Millionaire చిత్ర సంగీతానికి మరియు జై హొ గీతానికి ఆస్కార్ అందుకున్నారు. ఈ సినిమాను కొందరు బాలీవుడ్ వ్యక్తులు విమర్శించారు, మరి ఇన్నాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు తీయలేదు? విమర్శించినవారు బాగానే సంపాదిస్తున్నారు మరి వాళ్ళు సమాజానికి ఏమిచేస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారితయ చిత్రపరిశ్రమలో సత్యజిత్ రే కు జీవిత కాలపు ఆస్కార్ అవార్డు 1992 లో, అంతకుముందు భాను అతియా గారికి గాంధీ చిత్రానికి 1983 లో వస్త్ర అలంకరణ విభాగంలో ఆస్కార్ వచ్చింది. అవార్డు ప్రకటించిన తరువాత వేదిక పై తన వద్ద అమ్మ ఉంది " మేరె పాస్ మా హై" అమ్మ ఆశిస్సులు ఉన్నాయీ అని A.R.రహమాన్ మన భారతీయ సంప్రదాయం, అమ్మ ఆత్మీయతను చాటారు. అంతర్జాతీయ స్థాయిలో తన సంగీతం తో భారతీయ సత్తా చాటిన A.R.రహమాన్ కు మనఃస్పుర్తి శుభాకాంక్షలు. జై హొ




5 comments:

  1. నిజమే !
    మేరె పాస్ మా హై అన్న హిందీ డైలాగు ద్వారా తన భారతీయతను, మరో తమిళ డైలాగు ద్వారా తన మాత్రు భాషాభిమానాన్ని ప్రపంచానికి చాటుకున్నారు ఎ ఆర్ రెహమాన్. ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడం నిజంగా జీవితంలో మరచిపోలేని అనుభూతి.
    - ప్రభాకర్ మందార

    ReplyDelete
  2. ఏ రంగంలోనైనా భారతీయ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే గర్వించని భారతీయుడుండడు. ఇది కూడా అలాంటి ఒక సందర్భమే. ఐతే ఈ సినిమాకు ఇన్ని ఆస్కార్లు వచ్చాయి కాబట్టి భారతీయులు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటికంటే ఇదే గొప్ప సినిమా అనే భ్రమలో గాని లేరుగద మీరు కొంపదీసి? అలాగే రెహమాన్ ఇంత కంటే మంచి సంగీతం ఇంతకు ముందు మరే సినిమాకూ అందించలేదంటారా?

    "ఇన్నాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు తీయలేదు?" అని మీరు అడగడం చూస్తే నవ్వు వస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ వాళ్ళు తీయలేదు కాబట్టే ఈ అవార్డు వచ్చింది సోదరా! వివిధ రంగాల్లో (సంగీతం, వగైరా) ఇచ్చే ఆస్కార్ అవార్డులు ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఇచ్చేవి కావు. అవి కేవలం హాలీవుడ్డు సినిమాలకే పరిమితం. మిగతా ప్రపంచానికి చెందిన సినిమాలన్నిటికీ కలిపి "బెస్ట్ ఫారెన్ ఫిల్మ్" అవార్డు మాత్రమే ఇస్తారు.

    ఏమైనా ఈ సినిమాకు వచ్చిన ఈ అవార్డులు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా పట్ల ఆసక్తిని, గౌరవాన్ని పెంచుతాయి. నేను ఇందుకు సంతోషిస్తున్నాను.

    ReplyDelete
  3. భారతీయులు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటికంటే ఇదే గొప్ప సినిమా అనే భ్రమలో మాత్రం లేను సోదరా! మన వద్ద ఎంత ప్రతిభ వున్నా, ఆ ప్రతిభ చాటడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది అలంటి వెదికే ఆస్కార్. A.R. రహమాన్ ఇంతకంటే ఎంతో అద్బుతమైన సంగీతం అందిచారు. కాని, అది మనకు తెలుసు కొంతమంది విదేశీయులకు కూడా తెలుసు. ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా మన A.R. రహమాన్ తెలిసాడు. ఈ సినిమా బాలీవుడ్ వాళ్ళు తీయలేదు కాబట్టే ఈ అవార్డు వచ్చింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే లగాన్ ఆస్కార్ బరిలో ఉన్నప్పుడు దానికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో గుర్తుండే ఉంటుంది. అది చాల మంచి సినిమా అప్పటికే ప్రేక్షక ఆదరణ పొందింది, ఐన సరే ఆస్కార్ బరిలో ఉన్నప్పుడు విశేష ప్రచారం లబించింది. కారణం, సినిమా ప్రతిభ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించ బడుతుంది ఇంకా మన వాళ్ళకు గుర్తింపు వస్తుందని.
    "ఇన్నాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు తీయలేదు?" అని అడిగాను ఎందుకటే వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి. అంతకంటే మంచి సినిమా అంతర్జాతీయ ప్రేక్షకుల కొరకు తీసి అప్పుడు విమర్శిస్తే బాగుంటుంది.

    ReplyDelete