Saturday, February 21, 2009

చిల్లర - నన్ను చులకన చేయకండి

ఈ మద్య ప్రతి సినిమాకు ఓ సబ్ టైటిల్ జోడిస్తున్నారు. ఇక్కడ చిల్లర అనబడే డబ్బులు, వినియోగదారులు చులకన చేసేస్తున్నారని తెగ బాదపదిపోతున్నై. ఇక కథలోకి వెళితే ప్రతి రోజు పెట్రోలు వాడే వాహన చోదకులు పెట్రోలు పోసుకున్నాక చిల్లర డబ్బులు అడగలేక పోతున్నారు, పెట్రోల్ బంక్ వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకటే ఒక లీటరు పెట్రోల్ రూ: 45.56 పైసలు అవుతుంది, కాని మన అద్రుష్టం కొద్ది 50 పైసల వరకు చిల్లర మనకు లేదు కాబట్టి లీటరు పెట్రోల్ కి బంకు వాళ్ళు 46 రూపాయలు తీసుకుంటున్నారు, ఆయిల్ కలిపితే మరో రూ 7.50 నుండి రూ 8.00 వరకు వసూలు చేస్తారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే కొందరు వాహనదారులు పెట్రోల్ బంక్ వాళ్ళు ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చేస్తారు తప్ప లెక్క అడగరు. ప్రతి వాహన దారుడు లీటరు పెట్రోల్ పై ౦.44 నష్ట పోతున్నాడు. మనం ఇక్కడ కాస్త స్మార్ట్ గా ఆలోచిస్తే ౦.44 పైసలు ప్రతి లీటరు పెట్రోలు పై ఆదా చేయవచ్చు. ప్రస్తుతం అన్ని పెట్రోలు బంకు లలో డిజిటల్ మీటర్ ఉన్న ఫిల్లింగ్ మెషిన్లు వున్నాయ్, లీటరు పెట్రోలు బదులుగా రూ 45.౦౦ లేదా చిల్లర లేకుండా సరి చూసుకొని ( ఉదా: 50, 100 ) రూపాయలకు పెట్రోలు పోయామని చెప్పాలి మరియు ఫిల్లింగ్ మెషిన్ లో మనకు కావలిసినన్ని రూపాయలు ఫీడ్ చేసినతరువాత పెట్రోలు పోసుకోవటం మంచిది. ఒక వేళ మీది స్కూటర్ ఐతే మీరు ఆయిల్ పోసుకుంటే దాని డబ్బులు, పెట్రోల్ డబ్బులతో సహా లెక్క చేసి ఇవ్వండి. చిల్లరను చిన్న చూపు చూసి బంకు వాళ్ళకే వదిలివేయటం ఆపి, జోబుకు చిల్లు పడకుండా కాపాడుకోవచ్చు. ఇచ్చే డబ్బుకు తగిన సామగ్రి మనకు వచ్చిందో లేదో చూసుకోండి. లేదంటే పరోక్షంగా అవినీతిని ప్రోతసహించిన వారమవుతాము.


0 comments:

Post a Comment